వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన ఇండోర్ షటిల్ కోర్టును ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
విధుల ఒత్తిడిని క్రీడల ద్వారా సులభంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

