వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం కుర్థుల్పేట్ గ్రామంలో లబ్ధిదారు మేకల బలమని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ గాండ్ల నవనీత సతీశ్ ముగ్గు పోశారు. నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఇల్లు మంజూరు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమానికి ప్రాధాన్యం లభిస్తోందని, పథకాలతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

