Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెల్లింగ్ బీ విజేతగా భారత సంతతి విద్యార్థి

Follow Udayam on Google
Swati Chaturvedi May 30, 2026 11:24 AM జాతీయంGeneral
స్పెల్లింగ్ బీ విజేతగా భారత సంతతి విద్యార్థి - Udayam
అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక 'స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ' పోటీలో 14 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థి శ్రేయ్ పారిఖ్ విజేతగా నిలిచాడు. కేవలం 90 సెకన్లలో 32 పదాలకు సరైన అక్షరక్రమం చెప్పి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ పోటీలో మొదటి మూడు స్థానాలూ భారత సంతతి విద్యార్థులకే దక్కడం విశేషం. కాలిఫోర్నియాకు చెందిన శ్రేయ్‌కు రూ.41 లక్షలకు పైగా నగదు బహుమతి, స్క్రిప్స్ కప్ లభించాయి. 1925 నుంచి జరుగుతున్న ఈ పోటీల ఫైనల్‌కు చేరిన తొమ్మిది మందిలో ఐదుగురు భారత మూలాలున్నవారే కావడం గమనార్హం.

Comments

G
Loading comments...