Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ నావికులు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 29, 2026 10:55 AM జాతీయంGeneral
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ నావికులు - Udayam
ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడుల నేపథ్యంలో MV AMIR1 కార్గో నౌకలో 13 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారు. నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. డ్రోన్లు, క్షిపణులతో వరుస దాడులు కొనసాగుతుండటంతో సిబ్బంది ఆందోళనలో ఉన్నారని తెలిపింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని యూనియన్ కోరింది.

Comments

G
Loading comments...