వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాద నిరోధక చర్యల ముసుగులో అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పవిత్ర రంజాన్ మాసంలో అమాయక పౌరులను బలిగొనడం పాక్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఐరాసలో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మండిపడ్డారు.
భారత్‌పై నిందలు వేసేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ, అక్కడి రాజకీయాల్లో సైన్యం పాత్రను ఆయన ప్రశ్నించారు. ఈ ఏడాది పాక్ దాడుల్లో 269 మంది అఫ్గాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Loading comments...

