Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోర్ జాతీయ పోటీల్లో మెరవనున్న కరీంనగర్ కుర్రాళ్లు

Follow Udayam on Google
S kumar Aug 30, 2026 6:05 PM పెద్దపల్లిGeneral
ఇండోర్ జాతీయ పోటీల్లో మెరవనున్న కరీంనగర్ కుర్రాళ్లు - Udayam
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎం డీ ఆజన్ (గోదావరిఖని), భువన్, స్వరన్ (కరీంనగర్) జాతీయ స్థాయి వాటర్ పోలో పోటీలకు ఎంపికయ్యారని స్విమ్మింగ్ కోచ్ కృష్ణమూర్తి తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి విజేతలుగా నిలిచిన వీరు, సెప్టెంబర్ 6న మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో జరగనున్న జాతీయ జూనియర్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...