వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇంధన సర్‌ఛార్జీలను పెంచింది. అక్టోబర్ 6 నుంచి చేసే కొత్త బుకింగ్‌లకు ఈ పెంపు వర్తించనుంది. దేశీయ విమానాల్లో దూరాన్ని బట్టి రూ.100 నుంచి రూ.350 వరకు అదనంగా చెల్లించాలి.
వరుసగా మూడు నెలలుగా ఏటీఎఫ్ ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయాలు భారమయ్యాయని ఇండిగో తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన వ్యయం దశాబ్దంలోనే అత్యధిక స్థాయికి చేరిందని పేర్కొంది.
Comments
Loading comments...

