Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 7 నుంచి ‘నేతన్న సేవలో’ పథకం అమలు: మంత్రి సవిత

ఆగస్టు 7 నుంచి ‘నేతన్న సేవలో’ పథకం అమలు: మంత్రి సవిత - Udayam Digital
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7 నుంచి ‘నేతన్న సేవలో’ పథకాన్ని అమలు చేయనుందని మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఇటీవల ఈ పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులతో పాటు రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి అనుబంధ రంగాల వారు అర్హులని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...