వార్తలకు తిరిగి వెళ్లండి

పేట మండలంలో అక్రమంగా కలప రవాణా జరుగుతోందని పలువురు స్థానికులు ఆరోపించారు. కొందరు రైతులను మాయమాటలతో ఒప్పించి చెట్లను నరికించి, కలపను దళారులకు విక్రయిస్తున్నారని తెలిపారు.
అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. అధికారులు స్పందించి రవాణాను అడ్డుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

