Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాప్రాలో అక్రమ వైన్ తయారీ: ఒకరి అరెస్ట్.

శిరీష గౌడ్ Jul 08, 2026 1:43 PM హైదరాబాద్ 7 viewsabout 2 hours ago
మేడ్చల్ జిల్లా కాప్రాలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి ఒకరిని అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 7 రకాల పండ్లతో నకిలీ వైన్ తయారు చేస్తున్న ఆంథోనీ పీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి దాదాపు 377.7 లీటర్ల అక్రమ ఫ్రూట్ వైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎక్సైజ్ సిబ్బంది వెల్లడించారు.

Comments

G
Loading comments...