Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో అక్రమ ఆయుధాలు సీజ్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 20, 2026 2:40 PM నిజామాబాద్General
నిజామాబాద్‌లో అక్రమ ఆయుధాలు సీజ్ - Udayam
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేట్ అడవిలో చిరుతపులి మృతి ఘటన తర్వాత పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో భారీ అక్రమ ఆయుధాలు బయటపడ్డాయి. అనుమానాస్పదంగా సంచరిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన సోదాల్లో ఎనిమిది దేశవాళీ తుపాకులు, లైసెన్స్ లేని ఆయుధాలు లభించాయి. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటను అరికట్టడానికి ఈ ఆపరేషన్ చేపట్టామని, చిరుత మృతికి వీరికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...