Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లిగుట్టలో మైనింగ్ అక్రమాలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 20, 2026 7:31 AM నల్గొండGeneral
బొల్లిగుట్టలో మైనింగ్ అక్రమాలు - Udayam
దేవరకొండ నియోజకవర్గంలోని బొల్లిగుట్టలో క్వారీ లీజు ముగిసినప్పటికీ అక్రమ తవ్వకాలు సాగుతుండటంతో గిరిజన గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మైనింగ్ బ్లాస్టింగ్‌ల వల్ల వస్తున్న దుమ్ము ధూళితో ప్రజలు క్యాన్సర్, టీబీ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారుల అనుమతి లేకుండా కొన్నేళ్లుగా వ్యాపారం నడిపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి రూ.లక్షల్లో గండి కొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లీజు పునరుద్ధరణ కాలేదని, తగిన చర్యలకు ఆదేశించామని మైనింగ్ అధికారి తెలిపారు.

Comments

G
Loading comments...