వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో మట్టి తరలింపు నిబంధనలు గాలికి వదిలేశారు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాత్రివేళల్లో లారీలతో మట్టిని తరలిస్తున్నారు. రసీదులు లేని వాహనాలను అధికారులు సీజ్ చేసినా, క్షేత్రస్థాయిలో అక్రమ రవాణా ఆగడం లేదు.
పెద్ద వాహనాల వినియోగంతో రహదారులు దెబ్బతింటున్నాయి. ఇటుకబట్టీల నిర్వాహకులు, స్థానిక నేతల ప్రోద్బలంతో చెరువులకు గండి కొడుతూ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారు. ఈ అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

