Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 16న ఉద్యోగమేళా

Follow Udayam on Google
Mohammad Sep 12, 2026 1:05 PM అనంతపురంGeneral
ఈనెల 16న ఉద్యోగమేళా - Udayam
అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 16న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సుజ్లాన్ ఎనర్జీ, కియా, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హతలతో 18–35 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఆసక్తిగల వారు naipunyam.ap.gov. inలో నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...