వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ గుండా వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. పర్మిట్ లేకుండా, ఓవర్‌లోడ్‌తో మితిమీరిన వేగంతో వస్తున్న టిప్పర్ల వల్ల ఇసుక, కంకర రోడ్డుపై పడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ సిబ్బంది రోడ్డుపై పడిన కంకరను తొలగిస్తున్నా, మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతోందని వాహనదారులు చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

