Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో ఐబీఎం కార్యకలాపాలు పునఃప్రారంభం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 05, 2026 10:37 AM విశాఖపట్నంGeneral
విశాఖలో ఐబీఎం కార్యకలాపాలు పునఃప్రారంభం - Udayam
విశాఖను వీడిన ఐటీ దిగ్గజం ఐబీఎం మళ్లీ నగరంలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇసుకతోట ప్రాంతంలోని ల్యాన్సమ్‌ స్క్వేర్‌ భవనంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించనున్నారు. ఐబీఎం విశాఖ కేంద్రంగా మూడేళ్లలో రూ.321 కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతులు, 500కుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేయనుంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటుకు స్థలం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...