వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 13లోని బంజారా లేక్ సమీపంలో ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ వివాదాస్పద స్థలం విలువ సుమారు రూ.600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
ఈ భూమి కబ్జాకు గురికాకుండా ఉండాలని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా స్పందించింది. కోర్టు వివాదం తేలే వరకు ఎవరూ ఆక్రమించకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసి, హెచ్చరింపు బోర్డులను ఏర్పాటు చేసింది.
Comments
Loading comments...