Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కై డైవింగ్‌లో హైదరాబాద్ యువకుడి మృతి

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 17, 2026 10:36 AM హైదరాబాద్General
స్కై డైవింగ్‌లో హైదరాబాద్ యువకుడి మృతి - Udayam
అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరిగిన స్కై డైవింగ్ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గడ్డం మణి చంద్రతేజ (28) మృతి చెందాడు. పారాచూట్ సహాయంతో కిందకు దిగుతుండగా బలమైన గాలుల వల్ల నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగింది. ముప్పై అడుగుల ఎత్తు నుండి కింద పడటంతో తీవ్ర గాయాలపాలైన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. 2022లో అమెరికా వెళ్లిన తేజ, ప్రస్తుతం బోస్టన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు.

Comments

G
Loading comments...