వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి నగర్‌లో వీధికుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఇంటి సెల్లార్‌లో ఆడుకుంటున్న ఆద్విక్ అనే బాలుడిపై పది కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
వీధికుక్కల బెడదపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

