వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణే నా లక్ష్యం: సీఎం రేవంత్

హైదరాబాద్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహించడమే తన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గచ్చిబౌలిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. 2028 డిసెంబరు నాటికి ఈ విశ్వవిద్యాలయాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.
క్రీడల్లో సత్తా చాటే వారికి కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. గతంలో సిరాజ్, నికత్ జరీన్‌లకు గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Comments
Loading comments...