వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో వానాకాలం పంట పెట్టుబడి సాయం 'రైతుభరోసా' పంపిణీ శుక్రవారంతో సంపూర్ణం కానుంది. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుది విడతగా రూ.1,009 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
దీంతో కలిపి మొత్తం సాయం రూ.8,759 కోట్లకు చేరుతుంది. ఇప్పటివరకు 74 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరగా, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన వారికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

