వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని అత్యంత విలువైన కోకాపేట ప్రాంతంలో ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) ఉక్కుపాదం మోపింది. కోకాపేట కొత్త చెరువుతో పాటు మరో మూడు ప్రభుత్వ స్థలాలను కబ్జా నుంచి విముక్తి చేసింది. కేవలం ఒక్కరోజులోనే సుమారు రూ.4,117 కోట్ల విలువైన స్థలాలను స్వాధీనం చేసుకుని కంచె వేసింది.
చెరువు పరిధిని ఆక్రమించి కొన్ని ప్రముఖ స్థిరాస్తి సంస్థలు నిర్మించిన విల్లా ఆటస్థలాలు, పార్కులను అధికారులు తొలగించారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, సుమారు 22 ఎకరాల చెరువు స్థలాన్ని కాపాడినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

