వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో వర్జీనియాలో నివసిస్తున్న వీణ అనే తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలో ఒక వేడుకకు హాజరైన ఆమె, అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు మునిగి మరణించారు.
మృతురాలు హైదరాబాద్ ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడకు చెందిన దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కుమార్తె. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ బిడ్డ అకాల మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

