వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా గోమారం గ్రామంలో భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన గోపాల్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలోనూ అతడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
మద్యానికి బానిసై తరచూ గొడవలు పెట్టడంతో భార్య ఏడాది క్రితమే పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

