వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న రమేశ్, తన భార్య నాగమణిపై కల్లుగీసే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలవడంతో, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఆవేశంలో రమేశ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

