Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాహిల్స్‌లో భారీ చోరీ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 20, 2026 11:12 AM హైదరాబాద్General
బంజారాహిల్స్‌లో భారీ చోరీ - Udayam
బంజారాహిల్స్‌లోని ఓ ఎక్స్‌పోర్టు కార్యాలయంలో జరిగిన భారీ చోరీలో కిలోకుపైగా బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. డైమండ్ ఫిక్సింగ్ కోసం లాకర్‌లో భద్రపరిచిన 1,028 గ్రాముల నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుజరాత్ వ్యాపారి ఫిర్యాదు చేశారు. వాష్‌రూమ్ కిటికీ ధ్వంసం చేసి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...