వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీర్‌పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఆడెపు నర్సయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ మాట్లాడుతూ జాతీయ జెండా దేశభక్తి, జాతీయ ఐకమత్యానికి ప్రతీక అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

