వార్తలకు తిరిగి వెళ్లండి

హిందుస్థాన్ పెట్రోలియమ్ (HPCL) గత ఆర్థిక సంవత్సరానికి రూ.17,175 కోట్ల రికార్డు నికర లాభాన్ని ప్రకటించింది. బలమైన మార్కెటింగ్, రిఫైనింగ్ మార్జిన్ల వల్ల మునుపటి ఏడాదితో పోలిస్తే లాభాలు రెట్టింపు అయ్యాయి. మార్చి త్రైమాసికంలోనూ 46% వృద్ధిని సాధించింది.
ముడి చమురు శుద్ధిలో సంస్థ సరికొత్త రికార్డు సృష్టించగా, ఒక్కో షేరుపై రూ.19.25 డివిడెండ్‌ను సిఫారసు చేసింది. అయితే, అంతర్జాతీయ ధరల ఒత్తిడి వల్ల ప్రస్తుత త్రైమాసికం సవాలుగా ఉండొచ్చని కంపెనీ ఎండీ తెలిపారు.
Comments
Loading comments...

