వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ మిలిటరీ కాలనీలో బోయ నాగలక్ష్మి (46) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు, కుమారుడు, కోడలితో తరచూ జరిగే కుటుంబ ఘర్షణలతో ఆమె మనస్తాపానికి గురయ్యారు.
ఇటీవల కోడలు ఇంటిని వదిలి వెళ్లిపోవడంతో కలత చెందినట్లు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

