వార్తలకు తిరిగి వెళ్లండి
అన్న క్యాంటీన్లకు హోటల్ అసోసియేషన్ భారీ విరాళం

రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించింది. అసోసియేషన్ ప్రతినిధులు ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కును అందజేశారు.
ఈ గొప్ప కార్యక్రమానికి ముందుకొచ్చిన అసోసియేషన్ ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల బలోపేతానికి ఈ విరాళం ఎంతో దోహదపడుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Loading comments...