వార్తలకు తిరిగి వెళ్లండి

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆర్‌ఎంపీలతో కుమ్మక్కై సాధారణ జబ్బులకు కూడా భారీగా బిల్లులు వేస్తూ ప్రజలను దోచుకుంటున్నాయి. ఆసుపత్రులు పంపే కమీషన్ల కోసం ఆర్‌ఎంపీలు రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

