Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. పోలీస్‌ కమిషనర్‌ బదిలీ

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 2:24 PM జాతీయంGeneral
హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. పోలీస్‌ కమిషనర్‌ బదిలీ - Udayam
కేరళలో జడ్జి కుమారుడు నిందితుడిగా ఉన్న హిట్‌ అండ్‌ రన్‌ కేసు దర్యాప్తులో లోపాలున్నాయనే విమర్శల నేపథ్యంలో కొచ్చి నగర పోలీస్‌ కమిషనర్‌ కళిరాజ్‌ మహేశ్‌ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఓ సీఐ, ఎస్‌హెచ్‌ఓ సహా నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసినట్లు హోంమంత్రి తెలిపారు. నిందితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారని మృతుడి కుటుంబం ఆరోపించింది.

Comments

G
Loading comments...