వార్తలకు తిరిగి వెళ్లండి

కర్మన్‌ఘాట్ నందిహిల్స్‌లోని వివాదాస్పద భూములపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతంలో జారీ చేసిన ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్లను (ORC) రద్దు చేయడంతో దశాబ్దాలుగా ఇక్కడ నివాసముంటున్న వేలాది ఇండ్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు.
2004 నాటి జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. ఇనాం భూముల విచారణలో తీవ్ర చట్టపరమైన లోపాలు ఉన్నాయని న్యాయస్థానం నిర్ధారించింది. కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తులకు రక్షణ కరువైందని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

