వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకుండా, విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయవద్దనే జీవో నెం. 9 నిబంధనపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ప్రభుత్వ బకాయిలు చెల్లించకుండా కాలేజీలపై ఆంక్షలు పెట్టడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు, విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆగస్టు 15లోపు బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది.
Comments
Loading comments...

