వార్తలకు తిరిగి వెళ్లండి
దేవదాయ ట్రైబ్యునల్ చైర్‌పర్సన్‌కు హైకోర్టు నోటీసులు

ఏపీ దేవదాయ ట్రైబ్యునల్ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ జిల్లా జడ్జి ఎ.భారతి నియామకం తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం చైర్‌పర్సన్‌కు నోటీసులు జారీ చేసింది.
దేవదాయ చట్టంలో తెచ్చిన సెక్షన్ల సవరణలు, జీవో 435ను రద్దు చేయాలని కోరిన పిటిషన్లపై తదుపరి విచారణను సెప్టెంబరు 29కి వాయిదా వేసింది.
Comments
Loading comments...