వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ విద్యార్హత గల ఉద్యోగాల కోసం తమకున్న ఉన్నత చదువులను దాచిపెట్టి కొలువులు సాధించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ విధమైన చర్యలు అర్హులైన పేద అభ్యర్థుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
డిగ్రీ పూర్తి చేసి, ఆ విషయాన్ని దాచిపెట్టి పదో తరగతి అర్హతతో ఓ బ్యాంకులో అటెండర్‌గా చేరిన యువకుడిని తొలగించడాన్ని ధర్మాసనం సమర్థించింది. ఎక్కువ చదువుకున్నవారు ఇలాంటి పోస్టులకు పోటీపడితే, తక్కువ చదువుకున్నవారికి అసలు అవకాశాలే దక్కవని జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవ్‌ల ధర్మాసనం పేర్కొంది.
Comments
Loading comments...

