వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా టంగుటూరు 16వ నంబర్ జాతీయ రహదారిపై ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఇటీవల హైవేపై పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకరంగా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, భారీగా జరిమానాలు విధిస్తామని ఎస్ఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

