వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల కోసం మయన్మార్ వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు సైబర్ నేరస్తుల చెరలో తీవ్ర చిత్రహింసలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సాప్ కాల్ ద్వారా తమ దుస్థితిని వెల్లడించారు.
18 గంటలు బలవంతపు పని చేయిస్తున్నారని, సైబర్ నేరాలకు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. చిన్న తప్పుకూ దారుణంగా కొడుతూ భారీ జరిమానాలు విధిస్తున్నారని, తమను వెంటనే రక్షించాలని ప్రభుత్వాలను వేడుకున్నారు.
Comments
Loading comments...

