Udayam Digital
Menu
Breaking

హెచ్‌సీయూ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కలకలం

Anuroop Nov 20, 2026 8:49 AM హైదరాబాద్General
హెచ్‌సీయూ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కలకలం - Udayam Digital
గచ్చిబౌలి హెచ్‌సీయూ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్‌తో 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎం-అనెక్సీ, ఎన్‌ఆర్‌ఎస్‌ హాస్టళ్లలో ఆహారం తిన్న వారికి శుక్రవారం వాంతులు, విరేచనాలు కావడంతో హెల్త్‌ సెంటర్‌లో చికిత్స అందించారు. మెస్‌ల అపరిశుభ్రతపై ఫిర్యాదులు పట్టించుకోలేదని విద్యార్థి సంఘం ఆరోపణ. వీసీ, రిజిస్ట్రార్ స్పందించలేదని విమర్శించి, వైద్య శిబిరం, బాధ్యులపై చర్యలు కోరింది.

Comments

G
Loading comments...