వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వానలు దంచికొడుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఆల్రెడీ నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.
మరోవైపు విజయనగరం, మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. రాష్ట్రంలోని మిగతా చోట్ల ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉందని తాజాగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...
