వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని 18 జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈదురుగాలులు వీస్తుండటంతో ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. కొండ ప్రాంతాలు, సముద్రతీర జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

