వార్తలకు తిరిగి వెళ్లండి
పామర్రులో భారీ వర్షం: జలమయమైన కార్యాలయాలు
కిషోర్ కుమార్ Jun 27, 2026 5:07 AM కృష్ణా జిల్లా 1 viewsabout 2 hours ago

కృష్ణాజిల్లా పామర్రులో శుక్రవారం అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రధాన రహదారులు, వీధులు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది.
ఈ వర్షం ధాటికి పామర్రు తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా నీట మునిగింది. కార్యాలయ గదుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...