వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం వల్ల ముంబయి, దిల్లీ, బెంగళూరు సహా పలు నగరాల నుంచి వచ్చే విమానాలను అధికారులు దారి మళ్లించారు. ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
విమానాల మళ్లింపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం మెరుగుపడే వరకు విమాన రాకపోకలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

