Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన హరీశ్‌ రావు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 24, 2026 4:12 PM హైదరాబాద్General
విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన హరీశ్‌ రావు - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలంలోని సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి హరీశ్‌ రావు సందర్శించారు. అక్కడ విద్యుత్ సరఫరా మరియు నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. కరెంటు సరఫరా పరిస్థితులపై విద్యుత్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు ఉన్నారు.

Comments

G
Loading comments...