వార్తలకు తిరిగి వెళ్లండి

‘అక్టోబరు 7’ నాటి ఇజ్రాయెల్ దాడుల సూత్రధారుల్లో ఒకరైన హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ ఒడెహ్‌ను ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అంతం చేసింది. బాధ్యతలు స్వీకరించిన 11 రోజుల్లోనే గాజా నగరంలో జరిగిన దాడిలో ఆయన మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధ్రువీకరించారు.
గతంలో మరణించిన టాప్ లీడర్ హద్దాద్ స్థానంలో ఒడెహ్ బాధ్యతలు చేపట్టారు. నాటి మారణకాండకు కారణమైన ప్రతి ఒక్కరినీ మట్టుబెడతామని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ దాడుల వల్ల గాజాలో మరో ముగ్గురు మరణించగా, 12 మంది గాయపడ్డారు.
Comments
Loading comments...

