Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టు ఆదేశాలు: శ్రీకాకుళంలో మహిళకు ఏడాది పింఛన్ చెల్లింపు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 7:30 PM శ్రీకాకుళంGeneral
హైకోర్టు ఆదేశాలు: శ్రీకాకుళంలో మహిళకు ఏడాది పింఛన్ చెల్లింపు - Udayam
​హైకోర్టు ఆదేశాలతో ఓ మహిళకు పింఛన్‌ను సచివాలయ సిబ్బంది అందజేసిన ఘటన నరసన్నపేట మండలం రావులవలసలో చోటుచేసుకుంది. గ్రామస్థుడు నరసింహులు నవంబర్ 2023లో మృతి చెందగా..భార్య లక్ష్మికి స్పౌజ్ కేటగిరీలో జులై 2025 నుంచి పింఛన్ మంజూరైంది. స్థానిక నాయకుడు రాజకీయ కక్షతో పింఛన్‌ను నిలిపివేశారని ఆరోపిస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో 12 నెలల బకాయిలతో పాటు ఆగస్టు పింఛన్‌ను అందజేశారు.

Comments

G
Loading comments...