హైదరాబాద్‌కు బాంబు బెదిరింపు కలకలం

హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల బాంబులు పేలుతాయంటూ పోలీసులకు బెదిరింపు ఈ-మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. ముంబై 26/11 ఉగ్రదాడి తరహాలో నగరంలో దాడి జరుగుతుందని ఆ మెయిల్‌లో హెచ్చరించారు.
ఈ సమాచారంతో వెంటనే స్పందించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, హైదరాబాద్ నగర పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసి, మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
