Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 31, 2026 12:39 PM మంచిర్యాలGeneral
హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలి - Udayam
దండేపల్లి మండలంలోని మాకులపేట గ్రామ శివారులో ఉన్న వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టి త్వరగా పూర్తి చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాకులపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులో ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న వంతెనను ఆయన పరిశీలించారు. వంతెన తెగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దాని స్థానంలో హై లెవెల్ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...