Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌లో ఎలుకల బెడద

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:56 PM మహబూబాబాద్ General
హాస్టల్‌లో ఎలుకల బెడద - Udayam
గూడూరులోని ప్రభుత్వ విద్యార్థుల హాస్టల్‌లో ఎలుకల బెడదతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కొరుకుతున్నాయని, దీంతో ఆందోళన చెందుతున్నామని తెలిపారు. హాస్టల్‌లో పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడంతో ఎలుకల బెడద పెరిగిందని విద్యార్థులు వాపోయారు. భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...