Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు అమలు చేయాలి కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా

Follow Udayam on Google
raju Sep 07, 2026 2:53 PM నిజామాబాద్General
హామీలు అమలు చేయాలి కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా - Udayam
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 6 గ్యారెంటీల పేరుతో నమ్మించి అధికారంలోకి వచ్చిందన్నారు. వెంటనే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...